ప్రమాదం కాపుకాసుకుని ఉంది. ఈ నాలుగు మాటలు చదవండి! ఆచరించండి!జాగ్రత్తగా ఉండండి! అందరికీ నమస్కారం🙏 మనం ఇప్పుడు చాలా విషమ పరిస్థితిలో ఉన్నాం. మన చుట్టు ప్రక్కల కరోనా మహమ్మారి దాక్కుని ఉంది. ఒక సర్వే ప్రకారం..... *మనం టీవీలో టెస్టులు చేసుకున్న వారి సంఖ్య మాత్రమే వింటున్నాం. టెస్టులు చేయించుకోకుండా వైరస్ సోకి ఉన్న వారు లక్షల్లో మనమధ్యే ఉన్నారు. అందుచేత..... *దయచేసి ఎవ్వరూ ఎవరి ఇంటికి వెళ్ళకండి! తెలిసిన వారే కదా అని వెళ్లి, వారిని ఇబ్బంది పెట్టకండి! *చెప్పకుండా చొరవగా వెళ్లి, వాళ్ల ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ కూర్చోకండి! ఏ వస్తువులు పడితే వాటిని ముట్టుకోకండి! ఒకవేళ బంధుమిత్రులతో మాట్లాడాలనుకుంటే, ఫోన్ కాల్ చేసి మాట్లాడండి! చూడాలనిపిస్తే వీడియో కాల్ చేసి మాట్లాడండి! *ప్రత్యక్షంగా కలవాలి అనుకుంటే ముందే ఫోన్ చేసి, ఇంటి ముందుకు వెళ్లి, బయటకు పిలిచి, మాస్కు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకొని కాసేపు మాట్లాడిరండి! అంతేకానీ చొరవతో తగుదునమ్మా అంటూ నేరుగా కిచెన్ లోకి, బెడ్ రూమ్ లోకి వెళ్లి, ఏమిటి కబుర్లు అంటూ అనవసరవిషయాలు మాట్లాడకండి! *వారు మొహమాటంతో, అప్పుడు మిమ్మల్ని ఏమీ అనకపోయినా,...
Comments
Post a Comment