Stay Safe - Maintain Social Distance - Avoid gatherings - Visits to others houses

ప్రమాదం కాపుకాసుకుని ఉంది.

ఈ నాలుగు మాటలు చదవండి! ఆచరించండి!జాగ్రత్తగా ఉండండి!

అందరికీ నమస్కారం🙏

మనం ఇప్పుడు చాలా విషమ పరిస్థితిలో ఉన్నాం.  మన చుట్టు ప్రక్కల కరోనా మహమ్మారి దాక్కుని ఉంది.

ఒక సర్వే ప్రకారం.....
*మనం టీవీలో టెస్టులు చేసుకున్న వారి సంఖ్య మాత్రమే వింటున్నాం.
టెస్టులు చేయించుకోకుండా వైరస్ సోకి ఉన్న వారు లక్షల్లో మనమధ్యే ఉన్నారు.
అందుచేత.....

*దయచేసి ఎవ్వరూ ఎవరి ఇంటికి వెళ్ళకండి!
తెలిసిన వారే కదా అని వెళ్లి, వారిని ఇబ్బంది పెట్టకండి! *చెప్పకుండా చొరవగా వెళ్లి, వాళ్ల ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ కూర్చోకండి!
ఏ వస్తువులు పడితే వాటిని ముట్టుకోకండి!
ఒకవేళ బంధుమిత్రులతో మాట్లాడాలనుకుంటే, ఫోన్ కాల్ చేసి మాట్లాడండి! చూడాలనిపిస్తే వీడియో కాల్ చేసి మాట్లాడండి!
*ప్రత్యక్షంగా కలవాలి అనుకుంటే ముందే ఫోన్ చేసి, ఇంటి ముందుకు వెళ్లి, బయటకు పిలిచి, మాస్కు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకొని కాసేపు మాట్లాడిరండి!
అంతేకానీ చొరవతో తగుదునమ్మా అంటూ నేరుగా కిచెన్ లోకి, బెడ్ రూమ్ లోకి వెళ్లి, ఏమిటి కబుర్లు అంటూ అనవసరవిషయాలు మాట్లాడకండి!
*వారు మొహమాటంతో, అప్పుడు మిమ్మల్ని ఏమీ అనకపోయినా, మీరు వెళ్లిపోయిన తర్వాత మిమ్మల్ని తిట్టుకోవడం ఖాయం.
వారు మిమ్మల్ని ఇంట్లోకి రమ్మని పిలిచినా, మీరు గౌరవంగా పర్వాలేదు, మరోసారి వస్తానని చెప్పి వెళ్ళండి!అప్పుడే మీరు మర్యాద తెలిసిన వ్యక్తులుగా పరిగణించబడతారు

*మీరు వారికి ఎంత ప్రాణ స్నేహితులైనా కావచ్చు!
లేక ఎంత దగ్గరి బంధువులైనా కావచ్చు! వారిని ఎట్టి పరిస్థితుల్లో కలవండి!
ఇక ఇరుగుపొరుగు వారు ఇచ్చే వంటకాలను ససేమిరా తీసుకోకండి!
*అలాగే వారికి మీ వంటకాలను ఇతర తినుబండారాలను ఏమీ ఇవ్వకండి!
ఇచ్చి పుచ్చుకోవడాలు కొంతకాలం ఆపేయండి.
*ఈ విషయమై వారితో ఒకసారి సౌమ్యంగా చెప్పండి!
స్నేహితులతో కలిసి అన్నిరకాల పార్టీలు కొన్ని రోజులు ఆపేయండి.
*ఈ పార్టీల వలన చాలా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.
అవసరం లేకపోయినా రోడ్డుమీదకు వెళ్ళకండి!
*వాకింగ్ కూడా మానేయండి!                                    ఇంట్లోనే యోగ, మెడిటేషన్, సూర్య నమస్కారాలు, స్కిప్పింగ్ వంటివి చేయండి!
నువ్వు నీ శ్రేయోభిలాషులకు ఇచ్చే గౌరవం వారిని కలవకపోవడమే. అదే ఇరువురికి క్షేమదాయకం.

ఇవి యదార్ధములుగా భావించి ఆచరించి, ఆరోగ్యంగా ఉండండి!
సమస్త లోకా: సుఖినో భవంతు

Comments

Popular posts from this blog

MyGov Corona Helpdesk - whatsapp: +91 9013151515

Key Links related to Corona Virus - Tracking, Cure, Remedies

covid care treatment options